Story behind-America

అమెరికా కి ఆ పేరు పెట్టింది ఎవ్వరు ?

అమెరికా ! అగ్ర రాజ్యం ! విశ్వ శక్తి ! గ్లోబల్ పెద్దన్న ! ప్రపంచ పోలీస్ ! స్వేచ్ఛా సమాజం ! ఇంకా  ఏన్నేన్ని విశేషణాలో !

మన పురాణాల్లో పాతాళం గా చెప్పబడిన ప్రాంతం,  ఇప్పటి అమెరికా నే అని ఈ మధ్యే చదివాము ! ఒక్కప్పటి కపిలారణ్యం , ఇప్పటి కాలిఫోర్నియా అని చదివాము.

ఇంకా కాస్త మందుకు లేదా లోతు కి వెళ్ళి పరిశోథిస్తే , అసలు ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది ? ఎవ్వరు అమెరికా అని నామకరణం చేసారు ? ఈ విషయం పరిశీ లిస్తే, చరిత్ర లో సంతృప్తి కర సమాధానాలు లేవు .
ఎవ్వరిని అడిగినా

 Kolumbus discovered America ఆనే చెబుతారు.

కోలంబస్ కన్నా ముందు   "ఆమెరిగో విస్పూచి " ఆనే నావికుడు అమెరికా ని కనుగొ న్నాడనీ , ఆ విషయం ఆలస్యం గా వెలుగు లోకి వచ్చి , అతని పేరు మీద అమెరికా అని పి లి చా ర నీ, ఇంకో కథనం.

ఇవన్నీ సత్య దూ రా లే ! అసలు దీనికి పూర్వ రంగం ఉత్తర రామాయణం లో వుంది.

ఆంధ్ర వాల్మీకి అని ప్రసిద్ధి గాంచిన శ్రీ మాన్ వావిలి కొల ను సుబ్బారావు గారు మందరము అను పేర రామాయణా న్ని ఆంధ్రీకరించి ఒంటి మిట్ట కోదండ రాముల వారికి అంకితం చేసి ధన్యులై నారు.

ఇందులో ఆఖరి కాండం ఐన ఉత్తర రామాయణం లో ఈ పేరు ప్రస్తావన కి వస్తుంది.

ఇక విషయానికి వస్తే ఒకసారి , రాక్షసులతో పోరాడుతూ ఇంద్రుడు వారిని తరుముతూ వెళితే వారు కనిపించ కుండా పోతారు. సరిగ్గా అప్పుడే నారదుడు ఇంద్రునికి ఎదురుగా వస్తాడు.

ఇంద్రుడు నారదుని రాక్షసుల జాడ గురించి ఆరా తీస్తాడు. మన నారదుల వారి సంగతి తెలిసిందే కదా ! ఇంద్రుని తో కాసేపు పరాచకాలు ఆడుదామని, తన చూపుడు వేలుతో  సై గ లు చేస్తూ కింది వైపుకి చూపిస్తాడు.

ఎన్ని సార్లు అడిగినా అవే సై గ లు. ఇక ఇంద్రుడికి సహనం నశించి, నారదుల వారి మీద ఆగ్రహించి గట్టిగా నిలదీసి అడుగుతాడు. అప్పుడు నారదుడు, నర్మ గర్భం గా పాతాళం ఆనే పేరు ఉఛ్చఱింఛ కుండా  "అ మే రు క " అని ఉఛ్చరిస్తాడు. దీనికి కారణం నారదుడు దేవ రాక్షసులతో ఇద్దరితో సమానం గా వ్యవహఱిస్తూ వుంటాడు కదా ! రాక్షసుల తో తనకెం దుకు అకారణ వైరం అని .

పై ఉచ్చారణ సరిగా గమనించండి. " అ మే రు క ".
మామూలుగా మనం ఏదైనా చిరునామా చెప్పేటప్పుడు ఒక సంకేతం, లేదా ఒక రిఫరెన్స్ పాయింట్ చెబుతాం. దాన్నే ల్యాండ్ మార్క్ అంటాము.

ఇక్కడ నా ర దు డు, ఇంద్రుడు వున్న ప్రాంతము  " మే రు పర్వతం ".  మేరు కి వ్యతిరేకం " అ మే రు " . ప్రపంచం లో అన్నింటి కన్నా ఎత్తయిన శిఖరం మే రు పర్వతమే కదా !

ఎత్తయిన వాటిని మేరు తో పోల్చడం వల్లే మెఱక ఆనే పదం పుట్టింది. మెరక , పల్లం రెండూ వ్యతిరేక పదాలు కదా !
శుభం, అశుభం ! న్యాయం , అన్యాయం ! అదే విధంగా " మే రు క " కి వ్యతిరేకం " అ మే రు క " . సరిగ్గా మనం వున్న ప్రాంతానికి వ్యతిరేక దిశ లో వున్న ప్రాంతం.

ఆ విధంగా అ మే రు క గా నామకరణం చేసింది నారద మహర్షి. కాల క్రమేణా అదే అమెరికా అయింది.

ఇలాంటి రహస్యాలు మహా భారతం లో ఇంకా ఎక్కువగా నిక్షిప్తం అయ్యి వున్నాయని పండితుల అభిప్రాయం.
మన దేశం ఈ సూ డో సన్నాసుల బారిన పడకుండా ఉండి ఉంటే , నెహ్రూ కి బదులు , పటేల్ ప్రధాని అయ్యి ఉంటే, భారతీయ చరిత్ర వక్రీ కరణ కి గురి కాకుండా పు రో గా మించే దిశగా , చరిత్ర పరిశోధన జరిగి ఉంటే , ఇటువంటి చారిత్రిక విషయాలు ఇంకా ఎన్ని బయటికి వచ్చేవో కదా !
ఇప్పటికైనా మించి పోయింది ఏముందీ ? భవిష్యత్తు మనదే !

ఇదండీ అమెరికా కథ.

జై హింద్ !

Comments

Popular posts from this blog

Shall I celebrate New Year

support sanathana dharma by joining rushipeetham

Beauty of Hindu Calendar