I'm a Hindu, Why I shouldn't celebrate English New Year
హిందువులు కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవచ్చా?
రచన: వడియాలు రంజిత్ కుమార్
ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31 అర్ధ రాత్రి కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 31 అర్ధ రాత్రి క్రీస్తు శకం 2017 (AD) వెళ్లి పోయి క్రీస్తు శకం 2018 వస్తుంది. క్రీస్తు శకం అన్న పేరే చెబుతోంది ఈ సంవత్సరాలకి క్రైస్తవానికీ ఎదో సంబంధం ఉంది అని. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ విషయం రెండు ముఖ్యమైన ప్రశ్నలని లేవనెత్తుతుంది
1. క్రీస్తు శకం లేదా AD (అలానే BC) అంటే ఏమిటి?
2. 2017 లేదా 2018 అనే ఈ లెక్క ఎప్పటి నుండి ఎందుకు ప్రారంభం అయ్యింది? జనవరి ఒకటినే ఎందుకు కొత్త సంవత్సరం వస్తోంది?
క్రీస్తుశకం లేదా AD (అలానే BC) అంటే ఏమిటి?
AD అంటే లాటిన్ భాషలో ఎన్నో డోమిని (Anno Domini). దీని అర్ధం “మా ప్రభువుకి చెందిన సంవత్సరం” ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే “మా ప్రభువైన యేసు క్రీస్తుకి చెందిన సంవత్సరం” అని. BC అంటే బిఫోర్ క్రిస్ట్ అంటే క్రీస్తు కి ముందు అని. అంటే కొత్త సంవత్సరంగా మతాలతో సంబంధం లేకుండా అందరూ జరుపుకుంటున్న ఈ పండగ క్రైస్తవ సంబంధం అయినది అనేది స్పష్టం. క్రైస్ట్ లేదా క్రీస్తు అనే పదం ఈ మొత్తం వ్యవహారం లో చాలా కీలకం, దానికి అర్దం “రక్షకుడు”
క్రైస్తవం లో విచిత్రమైన కథ ఒకటి ఉంది. దాని ప్రకారం పుట్టే ప్రతీ మనిషీ పాపే. దానికి మనం చేసే పాప పుణ్యాలతో సంబంధం లేదు. అసలు క్రైస్తవంలో పుణ్యం అనే పదమే లేదు. క్రైస్తవ మత మూల సిద్ధాంతం ప్రకారం ఇప్పుడే పుట్టిన పసిగుడ్డు నుండి కాటికి కాలు చాచిన ముదుసలి వరకూ అందరూ పాపులే. ఇప్పుడే పుట్టిన పసిగుడ్డుకి పాపం ఏమిటి అనే సందేహం కలగడం సహజం. ఈ సిద్ధాంతం ప్రకారం మనుషులు పాపులు అవ్వడానికి వాళ్ళు చేసే పాపాలు కారణం కాదు.
సృష్టి ఆరంభంలో బైబిల్ దేవుడు యెహోవా ఆదాము, హవ్వ అనే స్త్రీ పురుషులని సృష్టించి మీరు ఏమైనా తినవచ్చు కానీ అక్కడ ఉన్న “మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షము” అనే చెట్టు యొక్క పండ్లు మాత్రం తినవద్దు అని చెప్పాడు. సైతాను ప్రభావంతో వారు ఆ పళ్ళు తింటారు. తాను వద్దన్న చెట్టు పండు ఆదాము హవ్వ తిని పాపం చేశారు అనే కోపంతో ఆయన వారితో పాటు వారి సంతానం, ఆ సంతానానికి సంతానం, వారి సంతానం ఇలా అందరూ చనిపోయిన తరువాత అందరూ శాస్వత నరకంలో పడతారు అని శపిస్తాడు.
ఈ శాపం వలన మనుషులందరూ పుట్టడంతోనే పాపులుగా పుడుతున్నారు. దానిని “జన్మ పాపం” అంటారు. ఇలా రెండు లక్షల సంవత్సరాలు కొనసాగిన తరువాత (ప్రస్తుత అంచనాల ప్రకారం మనవ జాతి భూమి మీద కనీసం 2 లక్షల సంవత్సరాలు గా ఉంది) దాదాపు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ దేవుడు యెహోవా మనుషులని ఈ జన్మ పాపం నుండి రక్షించడానికి, యేసు ని పంపాడు. ఆయనని అప్పటి రోమన్ ప్రభుత్వం సిలువ వేసి చంపింది. ఆ సమయంలో యేసు చిందించిన రక్తాన్ని, ఆయన అనుభవించిన బాధని బైబిల్ దేవుడు యెహోవా మనుషులందరూ నరకంలో శాస్వతంగా అనుభవించే బాధలకి సమం చేసి మనుషులకి శాస్వత నరకం నుండి విముక్తి ప్రసాదించాడు. అయితే ఇది క్రైస్తవులకి మాత్రమె వర్తిస్తుంది. ఈ నరకం నుండి మనుషులు తప్పించుకోడానికి ఉన్న ఏకైక మార్గం క్రైస్తవుడిగా మారడమే అంటే యేసుని రక్షకుడుగా, క్రీస్తుగా అంగీకరించడమే. క్రీస్తు అనే పదానికి రక్షకుడు అని అర్దం అని ఇంతక ముందే చెప్పుకున్నాం. ఆయన రక్షణ కల్పించేది ఈ జన్మపాపం (ఆదిపాపం అని కూడా అంటారు) నుండి
AD, BC లుగా కాలాన్ని విభజిస్తున్న ప్రస్తుత క్యాలెండర్ ఆధారంగా మన పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, కొత్త సంవత్సరం లాంటివి జారుకోవడం ద్వారా మనమందరం కూడా యేసుని క్రీస్తుగా పరోక్షంగా అంగీకరిస్తున్నట్లే. అంటే మనం కూడా ఈ జన్మపాపం కథని నిజం అని ఒప్పుకున్నట్లే. ఇది హిందూ ధర్మానికి మూలమైన కర్మ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
2017 లేదా 2018 అనే ఈ లెక్క ఎప్పటినుండి ఎందుకు ప్రాప్రంభం అయ్యింది? జనవరి ఒకటినే ఎందుకు కొత్త సంవత్సరం వస్తోంది?
డిసెంబర్ 25 న యేసు పుట్టాడు అనేది క్రైస్తవుల నమ్మకం. ఆయన యూదు కుటుంబంలో పుట్టాడు కనుక ఆయన పుట్టిన తరువాత 8వ రోజున, అంటే జనవరి 1న ఆయనకి సున్నతి చేసి పేరు పెట్టారు అనేది మరో నమ్మకం. యేసు డిసెంబర్ 25న పుట్టాడు అని కానీ, బైబిల్ లో చెప్పిన లాంటి యేసు అనే వాడు ఒకడు ఉన్నాడు అని కానీ ఎటువంటి ఆధారమూ లేదు. జనవరి 1న కొత్త సంవత్సర ప్రారంభంగా ప్రపంచంతో అంగీకరింప చెయ్యడం ద్వారా అలానే కాలాన్ని AD, BC లుగా విభజింప జెయ్యడం ద్వారా చర్చి చాలా తెలివిగా యేసుని క్రీస్తుగా ప్రపంచం చేత పరోక్షంగా అంగీకపింప చేసింది.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న క్యాలెండరు ని గ్రెగేరియన్ క్యాలెండరు అంటారు. దేనిని 1582 వ సంవత్సరం లో ప్రవేశ పెట్టిన పొప్ గ్రెగరీ 13 వలన ఆ పేరు వచ్చింది. కాబట్టి హిందూ సోదరులారా జనవరి 1 కొత్త సంవత్సరం అనేది క్రైస్తవులకి సంబంధించిన పండగ. మనది కాదు, మనం జరుపుకోకూడదు.
క్రైస్తవులది ఐతే మాత్రం ఎం? జరుపుకుంటే తప్పేంటి?
క్రైస్తవం గురించి ఏమీ తెలియని కొందరు అమాయక హిందువులు అడిగే ప్రశ్న ఇది. బైబిల్ లో ఉన్న కొన్ని విషయాలు ప్రత్యేకంగా మీ కోసం
1. తనని కాక ఇతర దేవతలను పూజిస్తున్నారు అని, ఆ జాతి పురుషులని తమ పిల్లలని చంపి తినేలా, పిల్లలు తమ తండ్రులని చంపి తినేలా శపిస్తాడు (యేహెజ్కేలు: 6-12). మనం కూడా ఆయన దృష్టిలో అన్య దేవతలని పూజించే వాళ్ళమే.
2. ఈజిప్ట్ (బైబిల్ లో ఐగుప్తు అని ఉంటుంది) రాజు తన మాట వినలేదని, ఒక రోజు రాత్రి బైబిల్ దేవుడైన యెహోవా ఆ దేశం వారి ప్రతీ కుటుంబంలో ఉన్న మొదటి సంతానాన్ని, పాలు తాగే పసిపిల్లలతో సహా రాత్రికి రాత్రి నిద్రలోనే చంపేస్తాడు. ఇశ్రాయేలు వాళ్ళు ఆయనకీ సంబంధించిన వారు కనుక వాళ్ళని వదిలేస్తాడు (నిర్గమకాండము: 12: 21-30)
3. పిల్లలు తల్లి తండ్రుల మాట వినకపోతే ఊరిబయటకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలి (ద్వితీయోపదేశ కాండము: 21: 18-21)
4. తనని తప్ప సూర్యుడిని కానీ మరే ఇతర దేవతలనైనా పూజించే వాళ్ళని ఊరిబయటకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు (ద్వితీయోపదేశ కాండము: 17: 2 - 4)
5. లోతు అనేవాడు తన ఇద్దరి కూతుర్లతో సంసారం చేసి పిల్లలని కంటాడు (ఆదికాండము 19: 30-36). ఇతను యేసు పూర్వీకులలో ఒకడు.
6. “నీకు చెందినా ఏదైనా ఓక పట్టణములో కొందరు అన్య దేవతలను పూజిస్తుంటే, ఇతరులని కూడా పూజ చేయ్యమంటుంటే, నువ్వు ఆ పట్టణములో ఉన్న అందరినీ, పిల్లలు, స్త్రీలు, జంతువులతో సహా అందరినీ చంపేసి ఆ ఊరిని పూర్తిగా కాల్చి బూడిద చెయ్యి” - ఇది బైబిల్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ (ద్వితీయోపదేశ కాండము: 13: 12 - 16)
అన్ని మతాలూ ఒక్కటే అనేది కేవలం హిందువులు మాత్రమే నమ్మే అబద్దం. నిర్ణయం మీదే
జై శ్రీరాం
భారత్ మాతాకీ జై

Comments
Post a Comment