True Face of Communism
కంమ్యునిసం గురించి చాలా మంది కంమ్యునిస్తులకి కూడా తెలియని విషయాలు. కమ్యూనిజం అత్యంత ప్రమాదకరం
రచన: వడియాలు రంజిత్ కుమార్
ఒక సిద్ధాంత లక్ష్యం గొప్పది అయినంత మాత్రాన అది గొప్ప సిద్ధాంతం అని అనలేము. ఆ లాక్ష్యాన్ని ఆ సిద్ధాంతం సాధించినప్పుడు మాత్రమే అది గొప్ప సిద్ధాంతం అవుతుంది. ఈ విషయంలో కమ్యునిసం దారుణంగా విఫలమయ్యిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కారణాలు ఏమైనా కంమ్యునిస్టుల చేతిలో పడ్డ ప్రతీ దేశం సర్వ నాశనం అయిపొయింది. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు (చైనా అభివృద్ధి వారు స్వేచ్చా వాణిజ్యాన్ని అనుమతించిన తరువాతే ప్రారంభం అయ్యింది), ఉత్తర కొరియా కావచ్చు, క్యూబా కావచ్చు, తూర్పు జర్మనీ కావచ్చు. కమ్యునిస్టులు చెప్పుకొనే విదంగా నార్వే కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ కమ్యునిస్టు దేశాలు కావు. అక్కడ కూడా పెట్టుబడి దారీ విధానమే ఉంది. 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న కమ్యునిస్టులు ఆ రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ది చెయ్యలేక పోయారు. కేరళ ఒక్కటే కొంత పర్లేదు. దానికి కూడా ప్రధాన కారణం ప్రవాస భారతీయుల నిధులు అనే వాదన ఉంది. కేరళ నుండి ఉద్యోగ నిమిత్తం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్తారు అనే విషయం మీకు తెలియంది కాదు
అది మాత్రమే కాక కమ్యునిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డ దాదాపు అన్ని చోట్లా విపరీతమైన హింస చోటుచేసుకుంది. కోట్ల మంది చంపబడ్డారు. హవాయి విశ్వవిధ్యాలయం, అమెరికా వారి పరిశోధన ప్రకారం కమ్యునిస్టు ప్రభుత్వాలచే చంపబడ్డ వారి సంఖ్య 11 కోట్లకి పైమాటే [1]. చంపబడ్డ వారే 11 కోట్ల మంది ఉంటే ఇక మానసిక, శారీరిక, ఆర్ధిక బాధలు అనుభవించిన వారు ఇంకెందరో. “ది బ్లాకు బుక్ అఫ్ కంమ్యునిసం” పుస్తక ప్రచయితల ప్రకారం కమ్యునిస్టు ప్రభుత్వాల చేతిలో చంపబడ్డ వారి సంఖ్య 8.5 నుండి 10 కోట్లు [ది బ్లాకు బుక్ అఫ్ కంమ్యునిసం – Foreword]. అయినా కమ్యునిస్టు పార్టీ కార్యాలయాలలో ఇలా కోట్ల మంది చావుకు కారణమైన స్టాలిన్, మావో ల చిత్ర పటాలని ఇప్పటికీ చూడవచ్చు.
ఎప్పుడైతే ఒక సిద్ధాంత లక్ష్యం, ఆ సిద్ధాంత లక్ష్యం కాకుండా, ఆ సిద్ధాంతం గొప్పది అని నిరూపించడంగా మారుతుందో అప్పుడు ఇక ఆ సిద్ధాంతం ప్రమాధకరంగా మారుతుంది. కమ్యునిస్టుల పరిస్తితి అదే. వారి సిద్ధాంతంపై వారికున్న వ్యామోహం చివరికి వారిని దేశ ద్రోహులుగా కూడా మారుస్తుంది. భారత – చైనా యుద్ధ సమయంలో వారు చైనాని సమర్ధించడం దీనికో ఉదాహరణ[2].
కమ్యునిస్ట్ సిద్ధాంతం సఫలం అవ్వడానికి ఆవకాశం ఉందా?
నాకు తెలిసి లేదు. ప్రజాస్వామిక దేశాన్ని కమ్యునిస్టు రాజ్యంగా మార్చాలి అంటే వాళ్లకి పేదరికం అత్యవసరం. వాళ్లకి ఓట్ వేసే వారిలో ఎక్కువ శాతం మంది పేదవారే. పేదవారికే సమానత్వం ఎక్కువగా రుచిస్తుంది. ఎన్నికలలో గెలవాలి అంటే కంమ్యునిస్టులకి పేదల్ని, పేదలుగా ఉంచడం చాలా అవసరం. కమ్యునిస్టు సిద్ధాంత లక్ష్యం పేదరిక నిర్మూలన, కానీ వారి సిద్ధాంత మనుగడకి పేదరికం అత్యవసరం. అందువలన వారు నిరంతరం పేదరికాన్ని నిర్మూలిస్తాము అని వాగ్దానాలు చేసి ఎన్నికలలో గెలిచి ఆ పేదరికాన్ని పెంచి పోషించాలి. అప్పుడు మాత్రమే వారి మనుగడ సాధ్యం. ప్రపంచంలో ఏ ధనిక దేశంలో కూడా కమ్యునిస్టులు లేకపోవడం, మన దేశంలో కూడా అభివృద్ధి జరుగుతున్న కొద్దీ వారు ఉనికిని కోల్పోవడం గమనించవచ్చు. ప్రజాస్వామ్యంలో వారి బలం నిలబడి, చివరికి ప్రజాస్వామ్య దేశాన్ని కమ్యునిస్ట్ దేశంగా మార్చాలన్నా వారికి పేదరికం అత్యవసరం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ, కమ్యునిస్టు వ్యవస్థలో కానీ కమ్యునిస్టు సిద్ధాంతం వలన ప్రయోజనం లేదు, పైగా నష్టం.
1. http://www.hawaii.edu/powerkills/COM.ART.HTM
2. http://archive.indianexpress.com/…/during-china-war…/488983/

Comments
Post a Comment